News February 22, 2025

ASF: రైలుపట్టాలపై మృతదేహాలు

image

MNCL, ASF జిల్లాల్లో రైలు పట్టాలపై మృతదేహాలు లభ్యమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిర్పూర్(టి) సమీపంలో శుక్రవారం ఒక మృతదేహం కనిపించగా.. అంతకుముందు బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లో పలు ఘటనలు వెలుగుచూశాయి. కొంతమంది వివిధ కారణాలతో రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు విడుస్తుంటే.. మరికొందరు అనుకోని రీతిలో రైళ్ల కింద పడుతున్నారు. ఇక నెలలో పదుల సంఖ్యలో ఘటనలు జరగడం అందరినీ కలిచివేస్తోంది.

Similar News

News July 6, 2025

చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చెంచులకు 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రేపు అచ్చంపేటలోని మున్ననూర్‌లో జరిగే కార్యక్రమంలో చెంచులకు తొలి విడత ఇళ్లను మంజూరు చేయనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఆసిఫాబాద్‌లో 3,371, అత్యల్పంగా నాగార్జున‌సాగర్‌లో 17 ఇళ్లు కేటాయించారు.

News July 6, 2025

రాయచోటిలో ఘోర ప్రమాదం

image

రాయచోటిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి-మదనపల్లె మార్గంలోని ఇస్తిమా మైదానానికి సమీపాన ఉన్న శ్రీనివాసపురం వద్ద లారీ, ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో మృతదేహం ఛిద్రమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2025

పటాన్‌చెరు: మానవ అవశేషాల అప్పగింత సజావుగా జరగాలి: కలెక్టర్

image

సిగచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి అవశేషాల అప్పగింత సజావుగా జరగాలని కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఇప్పటివరకు 42 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మరో 8 మంది గల్లంతవగా, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.