News February 22, 2025
అనంత: హైవేపై రోడ్డు ప్రమాదం

పెద్దవడుగూరు మండలం కాసేపల్లి టోల్ ప్లాజా సమీపంలో 44 హైవేపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెనుక వైపు నుంచి ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సు హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News February 23, 2025
కసాపురం అంజన్నకు వెండి రథోత్సవం

గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా ఆలయ అధికారులు అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువ జాము నుంచి ఉత్సవమూర్తికి విశేష పుష్పలతో అలంకరించి పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వెండి రథోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
News February 22, 2025
అనంతపురం టుడే టాప్ న్యూస్

☛ రేపు అనంతపురం జిల్లాలో గ్రూప్-2 పరీక్షలు యథాతథం
☛ అనంతపురం జిల్లాలో 144 సెక్షన్
☛ అనంతపురం హైవేపై రోడ్డు ప్రమాదం
☛ గుత్తి బావిలో పదో తరగతి విద్యార్థి మృతి
☛ ఈ నెల 25న రాయదుర్గంలో జాబ్ మేళా
☛ అనంతపురం JNTU బీటెక్ పరీక్షా ఫలితాలు విడుదల
☛ పరిటాల శ్రీరాంను అభినందించిన జేసీ
News February 22, 2025
గ్రూప్-2 పరీక్షలపై అనంతపురం కలెక్టర్ క్లారిటీ!

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జరగవలసిన గ్రూప్-2 పరీక్షలు రద్దు అయ్యాయని సోషల్ మీడియాలో వస్తున్న వాటికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. గ్రూప్-2 పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయలేదని తెలిపారు. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే వారికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అయితే పరీక్షలను వాయిదా వేయాలని APPSCకి ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే.