News February 22, 2025

మునుగోడు: ధరణి ఫైళ్లను పరిశీలించిన కలెక్టర్

image

మునుగోడు తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ధరణి ఫైళ్లను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని పరిష్కరించారని అడిగి తెలుసుకున్నారు. ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట చండూర్ ఆర్డీఓ శ్రీదేవి తదితరులు ఉన్నారు.

Similar News

News February 23, 2025

SLBC టన్నెల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, SP

image

SLBC టన్నెల్ ప్రమాద ఘటన స్థలాన్ని (నాగర్ కర్నూల్ జిల్లా, దోమలపెంట) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ శనివారం సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలు అక్కడ ఉన్న ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఏసీపీ మౌనిక, ఇతర అధికారులు ఉన్నారు.

News February 23, 2025

నల్గొండ జిల్లా టాప్ న్యూస్

image

✓ SLBC టన్నెల్ పైకప్పు కూలి సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ✓ G- 20 సదస్సుకు ఎంపికైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థి ✓ కేతేపల్లిలో బర్డ్ ఫ్లూతో 7,000 కోళ్ల మృతి ✓ ఉమ్మడి జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు నమోదు ✓ తప్పుడు వార్త రాసిన విలేకరిపై చర్యలు తీసుకోవాలి: టీఎన్జీవో

News February 22, 2025

హుజూర్నగర్: డాబా పైనుంచి పడి యువకుడి మృతి

image

గరిడేపల్లి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి సాయిరాం పనిచేస్తూ వనస్థలిపురంలో ఉంటున్నాడు. గురువారం రాత్రి హుజూర్నగర్ పట్టణంలోని తన స్నేహితుడు నరేశ్ వాళ్ల బావ ఓరుగంటి శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు. వారితో కలిసి డాబా ఎక్కి మద్యం తాగుతుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి మృతిచెందినట్లు వారు తెలిపారు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నట్లు మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు SI ముత్తయ్య కేసు నమోదు చేశారు.

error: Content is protected !!