News February 22, 2025
యువకుడిపై కత్తితో ట్రాన్స్‌జెండర్ దాడి

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం పెద్దతండాలో చికెన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్‌ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్‌జెండర్ పరారీలో ఉంది.
Similar News
News July 7, 2025
రాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. తలమీద నుంచి వెళ్లిన లారీ

నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాంపల్లిలోని వీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ వద్ద లారీ కింద పడి వ్యక్తి దుర్మరణం చెందాడు. బైక్ మీద వస్తున్న వ్యక్తి స్కిడ్ అయి పడిపోవడంతో వెనుక నుంచి వస్తున్న లారీ ఆయన తలపై ఎక్కింది. దీంతో స్పాట్‌లోనే మృతి చెందాడు. మృతుడు నారపల్లికి చెందిన బాసిత్‌గా తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News July 7, 2025
HYD: NIMS ఆసుపత్రిలో OP తీసుకోవడం ఇక చాలా ఈజీ.!

HYD పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో OP తీసుకోవాలంటే గంటల తరబడి క్యూ లైన్‌లో వేచి ఉండే పరిస్థితి గతంలో ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితికి అధికారులు చెక్ పెట్టారు. ఆసుపత్రిలో కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేసి OP రిజిస్ట్రేషన్ పూర్తి చేసి స్లిప్పు అందించే ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వెంటనే స్లిప్పు వచ్చేస్తుంది. దీంతో సేవలు చాలా ఈజీగా అవుతాయని అధికారులు తెలిపారు.