News February 22, 2025

పల్నాడు: కోటి ఒక్క ప్రభ వస్తే స్వామి కిందకు వస్తాడు

image

గొల్లభామ పాతకోటయ్య స్వామికి ప్రతిరోజు పూజలు చేస్తుంది. తాను వయోభారంతో కొండ ఎక్కలేకపోతున్నా అని స్వామిని వేడుకోగా.. స్వామి ప్రత్యక్షమై నీవు వెనకకు చూడకుండా కిందకు నడువు, నీ వెనక నేను వస్తానని చెప్పాడు. గొల్లభామ కిందకు దిగుతూ స్వామి వెనక వస్తున్నారో లేదో అని విని తిరిగి చూడటంతో స్వామి శిలగా మారారు. దీంతో ఆమె స్వామిని వేడుకోగా.. కోటికి ప్రభలు వస్తే కోటప్పకొండ దిగి వస్తానని వరం ఇచ్చాడు.

Similar News

News November 3, 2025

MBNR: ఈనెల 7న దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

image

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఈ నెల 7వ తేదీన మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News November 3, 2025

ఎన్టీఆర్: MBA/MCA పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో MBA/MCA చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. NOV 13 నుంచి 24 మధ్య MBA, NOV 13 నుంచి 18 మధ్య MCA పరీక్షలను (ఉదయం 10-మధ్యాహ్నం ఒంటిగంట సెషన్‌లో)వర్సిటీ పరిధిలోని 5 కళాశాలలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని KRU అధ్యాపకులు తెలిపారు. పూర్తి వివరాలకు https://kru.ac.in/ చూడాలని కోరారు.

News November 3, 2025

కోయంబత్తూర్‌లో PG విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

image

కోయంబత్తూర్(TN) ఎయిర్ పోర్టు సమీపంలో PG విద్యార్థిని గ్యాంగ్ రేప్‌కి గురైంది. నిన్న సాయంత్రం ఆమె ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. రాత్రి 11గ.లకు ఎయిర్‌పోర్టు దగ్గర కారులో వారు ఉండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి అద్దాలు పగులగొట్టారు. ప్రియుణ్ని తీవ్రంగా కొట్టారు. ఆమెను దూరంగా షెడ్లోకి లాక్కెళ్లి రేప్ చేశారు. పోలీసులు బాధితుల్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.