News February 22, 2025
విజయనగరం వైసీపీ ప్రచార కార్యదర్శిగా బొద్దల

వైసీపీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శిగా బొద్దల సత్యనారాయణను నియమిస్తూ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు సత్యనారాయణ కృతజ్ఞతలు చెప్పారు. బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామానికి చెందిన సత్యనారాయణ సర్పంచిగా పని చేశారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News February 23, 2025
రైతుల సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియ: JC

రైతుల సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. భోగాపురం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న రావాడ గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గ్రౌండ్ ట్రూతింగ్ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
News February 23, 2025
VZM: 12 సెంటర్లు.. 6,265 మంది అభ్యర్థులు

జిల్లాలో ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరగనున్నాయని జేసీ సేతు మాధవన్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణకు 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6,265 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్- 2 పరీక్షలు జరుగుతాయన్నారు. నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
News February 23, 2025
VZM: సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి

విజయనగరం సబ్ జైలును అదనపు సివిల్ న్యాయమూర్తి టీవీ రాజేష్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది గాని తోటి ఖైదీలు కానీ ఎటువంటి వివక్షత చూపించరాదని సూచించారు. ఖైదీల పట్ల వివక్షత చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం లీగల్ ఎయిడ్ కేంద్రాన్ని సందర్శించారు.