News February 22, 2025
సంగారెడ్డి: మహిళా సంఘాలకు మార్చిలో ఎన్నికలు !

మహిళా సంఘాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. MLC ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. మార్చి నెలాఖరులోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 18,756 మహిళాసంఘాలు ఉండగా.. 1,90,381 మంది సభ్యులు ఉన్నారు. నిర్దేశించిన గడువులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News October 16, 2025
కర్నూలుకు పీఎం.. కడపకు భారీ పెట్టుబడులు

ఇవాళ ఏపీకి వస్తున్న ప్రధాని మోదీ కడప జిల్లాలో భారీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొప్పర్తిలో రూ.2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కడప, నెల్లూరు సరిహద్దు నుంచి CS పురం వరకు 41 KM మేర 2 వరుసల హైవే, కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై నిర్మించిన వంతెనను ప్రారంభించనున్నారు. మరోవైపు కడప ఉక్కుపై ప్రధాని స్పందించాలని పలువురు కోరుతున్నారు.
News October 16, 2025
పాలమూరు: నేడు PUలో 4వ స్నాతకోత్సవం

పాలమూరు వర్సిటీలోని గ్రంథాలయ ఆడిటోరియంలో ఇవాళ ఉదయం 10 గంటలకు 4వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు VC ప్రొ.డాక్టర్ జి.ఎన్.శ్రీనివాస్ Way2Newsతో ప్రత్యేకంగా తెలిపారు. ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్స్‌లర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొట్టమొదటిసారిగా గౌరవ డాక్టరేట్‌ను Dr.మన్నే సత్యనారాయణ రెడ్డికు ఇవ్వాలని వర్సిటీ పాలకమండలి నిర్ణయించింది.
News October 16, 2025
జనగామ: యంగ్ ఇండియా బిల్లులు.. రూ.24 లక్షల పైనే..!

జిల్లాలోని 71 ఉన్నత, 9 ప్రాథమిక, ఒక ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15 రోజుల పాటు ‘యంగ్ ఇండియా’ పేరిట నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరాల బిల్లులు రూ.24 లక్షల పైనే రావాల్సి ఉంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు తమ సొంతంగా ఖర్చు చేశారు. నాలుగు నెలలైనా బిల్లులు రాకపోవడంతో వారు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు.