News February 22, 2025

NZB జిల్లాలో వరుస గుండెపోట్లు

image

ఉమ్మడి NZBలో వరుస గుండెపోట్లు కలకలం రేపుతున్నాయి. 2రోజుల్లో బడికెళ్లే బాలిక, కూతురి పెళ్లిలో తండ్రి ఇలా ఇద్దరు మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు రావడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎలాంటి అనారోగ్య కారణాలు లేనివారు గుండెపోటుకు గురయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్య అలవాట్లు మెయిన్‌టేన్ చేస్తే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News February 23, 2025

NZB: జీవితంపై విరక్తి చెందిన మహిళ మృతి

image

నవీపేట్ మండలం సిరన్ పల్లి వడ్డెర కాలనీకి చెందిన మల్లవ్వ(40) గత కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంట్లో భర్తతో గొడవపడేది. ఈ నెల 14 వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. పొలంలో ఉన్న బావి నుంచి దుర్వాసన రావడంతో శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవీపేట ఎస్ఐ మృతదేహాన్ని బావి నుంచి తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News February 23, 2025

NZB: పసుపు రైతులు ఈ విషయాన్ని గమనించాలి

image

మహాశివరాత్రి సందర్భంగా లేబర్ హాలిడే కారణంగా ఫిబ్రవరి 26 నుంచి 28వ తేదీ వరకు నిజామాబాద్ శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డుకు సెలవు ఉంటుందని అలాగే మార్చి 1, 2 తేదీలలో శనివారం, ఆదివారం గంజ్ తెరిచి ఉన్న పసుపుకు సంబంధించిన లావాదేవీలు ఉండవని అధికారులు తెలిపారు. తిరిగి మళ్లీ మార్చ్ 3న ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పసుపు రైతులు ఈ విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

News February 23, 2025

NZB: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: కిషన్ రెడ్డి

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. 400 రోజులు దాటినా ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

error: Content is protected !!