News February 22, 2025
ఇబ్రహీంపట్నం: ఈ నెల 24న బడుల్లో వంట బంద్

రంగారెడ్డిలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ బంద్‌కు పిలుపునిచ్చింది. గురువారం CITU ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించాలని ఇబ్రహీంపట్నం MEOకు మెమోరాండం అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.10 వేల వేతనం ఇస్తామని హామీ ఇచ్చిందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న తెలిపారు. కానీ, ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 24న బడుల్లో ‘వంట బంద్’ చేసి చలో కలెక్టరేట్‌లో పాల్గొంటామన్నారు.
Similar News
News January 9, 2026
పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను సత్వరమే పంపిణీ చేయాలని కలెక్టర్ కృతికా శుక్లా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆర్డీవోలు, తహశీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకతతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News January 9, 2026
తెనాలి: రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష

తెనాలి (M) నందివెలుగు వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని రవాణా చేస్తూ పట్టుబడిన ఫిరంగిపురానికి చెందిన ఉయ్యాల తిరుపతయ్యకు 3 నెలలు జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పవన్ కుమార్ తీర్పు ఇచ్చారు. 2022లో అప్పటి రూరల్ SI CH వెంకటేశ్వర్లు నిర్వహించిన తనిఖీల్లో నిందితుడు 60 బస్తాల PDS బియ్యంతో పట్టుబడగా, శుక్రవారం కేసు విచారణకు వచ్చింది. APP సునీల్ కుమార్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు.
News January 9, 2026
గంజాయి అమ్మకాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో గంజాయి అమ్మకాలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌లో జరిగింది. జిల్లాలో ఎక్కడా గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలు జరగరాదన్నారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచి అమ్మకాలను నియంత్రించాలన్నారు.


