News February 22, 2025
NRPT: బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ

నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా శుక్రవారం నారాయణపేట జిల్లాలో అప్పకపల్లి గ్రామంలో దళిత మహిళ బంగలి దేవమ్మ ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి తొలి భూమి పూజ చేశారు. అనంతరం సీఎం నుంచి ఇంటి నిర్మాణానికి పత్రం అందుకున్న మహిళ ఆయనను కలిసి తన ఆనందాన్ని వ్యక్తం చేసి, ధన్యవాదాలు తెలిపింది.
Similar News
News November 7, 2025
NZB: 38.15 లక్షలు తీసుకొని మోసగించిన మహిళ అరెస్ట్

నిజామాబాద్‌లో డబ్బుల పేరుతో ప్రజలను మోసగించిన మహిళను అరెస్టు చేసినట్లు సౌత్ సీఐ సురేష్ తెలిపారు. ఇటీవల మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురి వద్ద 3 ఎకరాల భూమి ఇస్తానని నమ్మించి వారి నుంచి రూ.38.15 లక్షలు తీసుకొని మోసం చేసింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు స్వర్ణ ప్రమీలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆమె నుంచి బాధితుల చెక్కులు, ప్రాంసరీ నోట్లు, స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.
News November 7, 2025
అనకాపల్లి రైలు ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..!

దక్షిణ రైల్వే ప్రకటించిన పండగ ప్రత్యేక రైళ్లకు అదనపు హాల్ట్‌లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. భువనేశ్వర్ – బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైళ్లకు అనకాపల్లితో పాటు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్ స్టాప్‌లు కల్పించారు. అరకు – యలహంక, శ్రీకాకుళం రోడ్-బెంగళూరు కంటోన్మెంట్, సంబల్పూర్, కటక్ ప్రత్యేక రైళ్లకు కూడా అదనపు నిలుపుదల చేస్తూ గురువారం అధికారులు ప్రకటించారు.
News November 7, 2025
సంగారెడ్డి: ఈనెల 20 నుంచి బడి బయట పిల్లల సర్వే

జిల్లాలో ఈనెల 20 నుంచి 31 డిసెంబర్ వరకు బడి బయట పిల్లల సర్వే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. పాఠశాల పరిధిలోని గ్రామాల్లో, ఆవాస ప్రాంతాల్లో 6-14 సంవత్సరాలలోపు బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని పేర్కొన్నారు. గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రబంధ పోర్టర్లో నమోదు చేయాలని సూచించారు.


