News February 22, 2025
రాజంపేట ఎమ్మెల్యేకు నోటీసులు

రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపారు. మందపల్లి, ఆకేపాడు గ్రామాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూముల అక్రమణ ఆరోపణలపై MLA, ఆయన కుటుంబ సభ్యులు నేడు హాజరై వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ భూములను, వైసీపీ ప్రభుత్వం హయాంలో దాన విక్రయం కింద బదలాయించుకుని, అందులో ఎస్టేట్ నిర్మించుకున్నారని సుబ్బనరసయ్య ఫిర్యాదు చేశాడు.
Similar News
News September 17, 2025
జగిత్యాల : స్టాక్ మార్కెట్ పై విద్యార్థులకు అవగాహన

SKNR ఆర్ట్స్, సైన్స్ కళాశాల జగిత్యాలలో మంగళవారం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ సెక్యూరిట్స్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్(SEBI) నిపుణులు M.శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెట్టుబడులు పెట్టేముందు ఫండమెంటల్ అనాలసిస్, రిస్క్ మేనేజ్మెంట్ తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్, అధ్యాపకులు పాల్గొన్నారు.
News September 17, 2025
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్గా ప్రొఫెసర్ రత్న షీలామణి

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టార్, ఆంగ్ల విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ కె.రత్న షీలామణి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. ఈ నియామకంపై వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు రత్న షీలామణికి అభినందనలు తెలిపారు.
News September 17, 2025
మావోయిస్టుల సంచలన ప్రకటన.. ఆయుధాలు వదిలేస్తామని లేఖ

తక్షణమే ఆపరేషన్ కగార్ నిలిపివేసి, ఎన్కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. CPI మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట ఈ స్టేట్మెంట్ రిలీజైంది. కాగా అమిత్ షా 2026 మార్చి లోపు భారత గడ్డపై మావోయిస్టులను ఉండనివ్వబోమని డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. ఇది భద్రతా బలగాలకు అతిపెద్ద విజయం అని విశ్లేషకులు చెబుతున్నారు.