News February 22, 2025

సిద్దిపేట: హోమో సెక్స్‌కు అడ్డు చెప్పాడని హత్య

image

సిద్దిపేటలో వ్యక్తి<<15521843>> హత్య కేసు<<>>ను పోలీసులు ఛేదించారు. హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు ACP మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు కరీంనగర్ జిల్లాకు చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు.

Similar News

News December 28, 2025

పార్లమెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న మెదక్ విద్యార్ధి

image

పార్లమెంట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యార్ధి పాల్గొన్నారు. కేంద్ర విద్యా శాఖ(NCERT) ఢిల్లీచే ఎంపిక చేసి పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనడానికి పాపన్నపేట మండలం లింగాయపల్లి చీకోడ్ విద్యార్థి ఏ.శివ చైతన్య, ఉపాధ్యాయుడు ఆర్.కిషన్ ప్రసాద్‌ను ఆహ్వానించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల.. విద్యార్థి, ఉపాధ్యాయుడిని అభినందించారు.

News December 28, 2025

RMPT: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు శనివారం కన్నుమూశాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. RMPT మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం తేజ గౌడ్ మూడు నెలల క్రితం కర్నాల్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తలకి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా శనివారం పరిస్థితి విషమించి మృతి చెందాడు.

News December 27, 2025

MDK: న్యూ ఇయర్ జోష్.. ఎస్పీ కీలక సూచనలు

image

న్యూ ఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే జిల్లావ్యాప్తంగా పోలీసుల పహారా మొదలవుతుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు ముమ్మరం చేస్తామని, వేడుకల పేరిట హద్దులు దాటొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.