News February 22, 2025

కోహ్లీ అందుకే ఇబ్బంది పడుతున్నారు: హర్భజన్

image

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ విశ్లేషించారు. ‘నాకు తెలిసినంత వరకూ విరాట్ ఆటలో లోపం లేదు. ఇది మానసికంగా ఏర్పడిన అడ్డంకి అనుకుంటున్నా. కొంచెం ఆలస్యంగా బంతిని ఆడుతున్నారు. ఆయన ధీమాగా ఉండాలి. తాను విరాట్ కోహ్లీని అన్న విషయం మరచిపోకూడదు. ఎవరికీ ఏమీ నిరూపించుకునే అవసరం ఆయనకు లేదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News November 14, 2025

బెంగాల్, UPలో ఈ గేమ్ సాగదు: అఖిలేశ్ యాదవ్

image

బిహార్‌లో SIR పేరుతో ఆడిన గేమ్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, యూపీ, ఇతర రాష్ట్రాల్లో ఇకపై సాగదని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. బీజేపీ ఎన్నికల కుట్ర బయటపడిందని ఆరోపించారు. ‘వాళ్ల ఆటలు సాగనివ్వం. అలర్ట్‌గా ఉంటాం. బీజేపీ చర్యలను అడ్డుకుంటాం. బీజేపీ అంటే పార్టీ కాదు.. మోసం’ అని ట్వీట్ చేశారు. కాగా బిహార్ ఎన్నికల్లో భారీ విజయం దిశగా ఎన్డీయే దూసుకుపోతోంది.

News November 14, 2025

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు

image

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు పంట దిగుబడిని, కాపుకొచ్చిన కాయల నాణ్యతనూ తగ్గిస్తోంది. తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా.. మొక్క ఆకులు, రెమ్మలు, కాయలపైన మచ్చలు కలగజేస్తుంది. ఈ తెగులుకు గురైన మొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం జరుగుతుంది. కాయలపై ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో కాయలపై పగుళ్లు ఏర్పడి మార్కెట్‌కు పనికిరాకుండాపోతాయి.

News November 14, 2025

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణ

image

తెగులు ఆశించిన కొమ్మలను, కాయలను కత్తిరించి నాశనం చేయాలి లేదా కాల్చివేయాలి. తోటలో చెట్ల పాదుల్లో ఎకరాకు 8-10KGల బ్లీచింగ్ పౌడరును చల్లాలి. మొక్కలలో తెగులు లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి బ్లైటాక్స్ 3గ్రా.+ స్ట్రెప్టోసైక్లిన్ 0.2గ్రా కలిపి మొక్క బాగాలు తడిచేటట్లు స్ప్రే చేయాలి. ఈ మందులు పిచికారీ చేసిన వారం, 10 రోజుల తర్వాత కాసుగామైసిన్ (లీటరు నీటికి 3ml)ను స్ప్రే చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.