News February 22, 2025
రామగుండం: యువకుడిపై కత్తితో ట్రాన్స్‌జెండర్ దాడి

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం జిల్లాలోని పెద్దతండాలో చికెన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్‌ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్‌జెండర్ పరారీలో ఉంది.
Similar News
News December 9, 2025
మంచిర్యాల: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

మంచిర్యాల జిల్లా దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట మండలాల్లోని 90 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడా సమయం వృథా చేయకుండా ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
News December 9, 2025
కడప జిల్లా SP కీలక సూచన.!

భూ వివాదాలు, ఆర్థిక నేరాల విచారణలో న్యాయపరమైన నిబంధనలు పాటించాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులకు సూచించారు. సోమవారం ఎస్పీ ప్రొద్దుటూరు పోలీస్ అధికారులకు కేసుల విచారణలో నిర్దేశం చేశారు. క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. సంబంధిత అధికారులు, లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.
News December 9, 2025
సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.


