News February 22, 2025
ఎండతో భగ్గుమంటున్న హనుమకొండ!

హనుమకొండ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. పలు చోట్ల ఉదయం మంచు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు, చెరువులు, వాగులు, కుంటల్లో సైతం నీరు ఖాళీ అవుతోంది. దీంతో ప్రయాణం సాగించాలంటేనే వృద్ధులు, పిల్లలు జంకుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎండ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 9, 2025
మనిషికి సంస్కారం ఎందుకు ఉండాలి? అదెలా వస్తుంది?

శరీర మలినాన్ని స్నానం తొలగించినట్లే, జీవులకు అంటిన అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించి, సద్గుణాలు ప్రసాదించేదే నిజమైన సంస్కారం. ఈ కర్మ బాహ్య శుద్ధి కాదు, ఆత్మ శుద్ధి. మనస్సుకు, బుద్ధికి జ్ఞానంతో సంస్కారం చేయడం ద్వారానే మానవుడు దివ్యత్వాన్ని పొందగలడు. ఆచారాలు, సత్కర్మల ద్వారా మనసును సంస్కరించుకుని, ఉత్తమ జీవనం సాగించడమే మన లక్ష్యం. సంస్కారాన్ని తల్లిదండ్రులు, వేదాల పఠనంతో పొందవచ్చు. <<-se>>#VedikVibes<<>>
News November 9, 2025
హన్వాడ: సీఎంఆర్ ఇవ్వని రైస్ మిల్లులపై కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

ఈ ఏడాదికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్‌ను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఆ రైస్ మిల్లులపై కట్టిన చర్యలు తప్పవని అదనపు రెవెన్యూ కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. శనివారం హన్వాడ మండల పరిధిలోని రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ ఏడాదికి సంబంధించి సీఎంఆర్ పూర్తిగా చెల్లించని రైస్ మిల్లులకు కొత్తగా కోటాను కేటాయించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 9, 2025
గంగూలీ ICC అధ్యక్షుడు అవుతారు: మమతా బెనర్జీ

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒక రోజు ICC ప్రెసిడెంట్ అవుతారని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో WWC విన్నర్ రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కొన్ని విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడుతానని, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీనే ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా గతంలో ఆయన BCCI అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.


