News February 22, 2025
ఎండతో భగ్గుమంటున్న ములుగు!

ములుగు జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. పలు చోట్ల ఉదయం మంచు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతేకాదు, చెరువులు, వాగులు, కుంటల్లో సైతం నీరు ఖాళీ అవుతోంది. దీంతో ప్రయాణం సాగించాలంటేనే వృద్ధులు, పిల్లలు జంకుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎండ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News September 16, 2025
10 రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు: TTD ఛైర్మన్

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ‘28న జరిగే శ్రీవారి గరుడసేవకు 3లక్షలకు పైగా భక్తులు వస్తారు. అందరికీ మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తాం. చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తాం. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని లోపాలను సరిచేస్తున్నాం’ అని ఆయన చెప్పారు.
News September 16, 2025
భర్త ఉన్నా 10ఏళ్లుగా వితంతు పెన్షన్ తీసుకుంటున్న మహిళ

KNR కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పిల్లి భారతి అనే మహిళ తన భర్త చనిపోయాడని తప్పుడు సర్టిఫికేట్ చూయించి భూమిని తనపేరిట పట్టా చేయించుకుంది. అంతేగాక పదేళ్లుగా వితంతు పెన్షన్ పొందుతున్నట్లు తెలిసింది. ఆమె భర్త పిల్లి రాజమౌళి.. తాను జీవించి ఉన్నానని, ఆస్తిని తిరిగి తన పేరిట మార్చాలని కలెక్టర్‌ను కోరారు. కాగా, భారతి ఉద్యోగం డిమాండ్ చేస్తూ కలెక్టర్‌తో వాగ్వివాదానికి దిగగా పోలీసులు అదుపు చేశారు.
News September 16, 2025
సిద్దిపేట: SEP 17 తెలంగాణ విమోచన దినోత్సవమే: BJP

సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమేనని బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఆకుల విజయ అన్నారు. మంగళవారం సిద్దిపేటలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విమోచన దినోత్సవాన్ని పండగల జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 17న విమోచన దినోత్సవం పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఉన్నారు.