News February 22, 2025
నెల్లూరు: గ్రూప్-2 పరీక్షలకు 7 పరీక్ష కేంద్రాలు కేటాయింపు

ఈనెల 23న ఆదివారం జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు జిల్లాలో ఏడు పరీక్ష కేంద్రాలను కేటాయించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కరరావు తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ -1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ -11 పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలు, చిరునామాను తెలుసుకునేందుకు 0861 2331261 కంట్రోల్ రూమ్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News April 23, 2025
పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలలో తక్కువ బరువు ఉన్న పిల్లలపై అంగన్వాడి సూపర్‌వైజర్లు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్‌వైజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతినెల పిల్లల బరువులను, ఎత్తు చూసి రికార్డు చేయాలని సూచించారు. సీడీపీవోలు, సూపర్‌వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు.
News April 22, 2025
త్వరలో అంగన్వాడి పోస్టుల భర్తీకి చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన ICDS అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా అందించి పిల్లల ఎత్తు, బరువు పెరిగే విధంగా పని చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News April 22, 2025
మే 8 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలపై మంగళవారం అధికారులు సమీక్ష నిర్వహించారు. పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8 నుంచి 14 వరకు జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష అన్నారు.