News February 22, 2025

పెద్దపల్లి: ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల వద్ద సిసి కేమేరా: సీఈఓ

image

ఎమ్మెల్సీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ లతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరా లేదా వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు జాగ్రత్తగా పోలీస్ భద్రతతో కౌంటింగ్ కేంద్రాలకు తరలించాలన్నారు. పెద్దపల్లి కలెక్టర్లు కోయ శ్రీహర్ష, దాసరి వేణు తదితరులు ఉన్నారు.

Similar News

News February 28, 2026

మణుగూరు: 74 శాతం బొగ్గు ఉత్పత్తి

image

మణుగూరు ఏరియాలో ఫిబ్రవరికి గాను 74 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదైనట్లు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ వెల్లడించారు. శనివారం జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. 10.16 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 7.50 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కార్మికులు, అధికారులు కృషి చేయాలని కోరారు.

News February 28, 2026

కీరదోసలో బూడిద తెగులును ఎలా నివారించాలి?

image

కీరదోసలో బూడిద తెగులు ఆశిస్తే ఆకుల ఉపరితలంపై, కాడలపై తెల్లటి బూడిద వంటి పొడి ఏర్పడుతుంది. ఉద్ధృతి ఎక్కువైతే కాండం, పూతపై కూడా ఈ పొడి కనిపిస్తుంది. ఇది ఆకు మొత్తం కప్పేసి చివరికి ఆకులు పసుపు రంగులోకి మారి కాండంతో సహా ఎండిపోతాయి. దీనివల్ల మొక్కలు బలహీనపడతాయి. బూడిద తెగులు నివారణకు లీటరు నీటికి థయోఫనేట్‌ మిథైల్‌ (75% WG) 2.5 గ్రా. లేదా బినామిల్‌ 50% WP 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News February 28, 2026

ADB: బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం

image

రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. కామారెడ్డి MLA రమణా రెడ్డి నివాసంలో జరిగిన ఈ భేటీకి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు సిద్ధం కావాలని సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పాయల్ శంకర్, MLC అంజి రెడ్డి, MLAలు హరీష్ బాబు, రామారావు పాటిల్ పాల్గొన్నారు.