News February 22, 2025

నరసరావుపేట: తిరునాళ్లకు సిద్ధమవుతున్న ప్రభలు

image

మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు వైభవంగా జరగనున్నాయి. ఈ తిరునాళ్లకు భారీ విద్యుత్ ప్రభలు కొలువు తీరుతాయి. నరసరావుపేట, చిలకలూరిపేట మండలాలలోని పలు గ్రామాల ప్రజలు పోటా, పోటీగా ప్రభలు నిర్మిస్తారు. ఊరంతా కలిసికట్టుగా ఈ ప్రభ పనుల్లో పాల్గొని, ఒక్కో ప్రభ 90 అడుగులకుపైగా వరకు నిర్మిస్తారు. ఒక్కో ప్రభ వ్యయం రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుంది. 

Similar News

News November 9, 2025

తెనాలి: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని నార్త్ క్యాబిన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది GRP ఎస్సై వెంకటాద్రికి సమాచారం అందించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. తల, కాలు కట్ అయ్యి మృతదేహం భయానకంగా ఉందని స్థానికులు అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News November 9, 2025

గుంజీలు తీయడం పనిష్మెంట్ కాదు!

image

గుంజీలు తీయడం అంటే పనిష్మెంట్ అనుకుంటారు. కానీ వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గుంజీలు తీస్తే పొత్తి కడుపు, పేగు కండరాలు బలంగా తయారవుతాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే వాళ్లు రోజూ 30 గుంజీలు తీస్తే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని కొవ్వు కూడా తేలికగా కరిగి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. SHARE IT.

News November 9, 2025

వంజంగి మేఘాలకొండను సందర్శించిన కలెక్టర్

image

వంజంగి మేఘాలకొండ అందాలను కలెక్టర్ ఏ.ఎస్.దినేశ్ కుమార్ ఆస్వాదించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో వంజంగి కొండపైకి చేరుకున్నారు. మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయ కిరణాలు, మంచు మేఘాల అందాలను వారు తిలకించారు. కాగా వీకేండ్ కావడం, రెండు రోజుల సెలవుతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వంజంగి వచ్చి సందడి చేస్తున్నారు.