News February 22, 2025
టెస్లాకు AP భారీ ఆఫర్.. లోకేశ్ ప్రత్యేక చొరవ!

టెస్లాను ఆకర్షించేందుకు AP భారీ ప్రోత్సాహకాలను ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే షోరూముల్లో స్టాఫ్ హైరింగ్ ప్రాసెస్ మొదలవ్వడంతో మంత్రి నారా లోకేశ్ టీమ్ తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం. కార్లు, విడిభాగాలు దిగుమతి చేసుకొనేందుకు పోర్టు, ఫ్యాక్టరీ స్థాపనకు విస్తీర్ణమైన భూమి, EVలకు అవసరమైన బ్యాటరీ సహా అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నట్టు గుర్తుచేశారని తెలిసింది. టెస్లా వస్తే APకి వరమే!
Similar News
News January 28, 2026
అయ్యర్ ఏం పాపం చేశాడు.. గంభీర్‌పై విమర్శలు

NZతో నాలుగో టీ20 మ్యాచులో టీమ్ ఇండియా ప్లేయింగ్-11పై విమర్శలు వస్తున్నాయి. ఇషాన్ కిషన్ దూరమైతే అతడి స్థానంలో బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కాకుండా బౌలర్ (అర్ష్‌దీప్ సింగ్)ను తీసుకోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయ్యర్ 3, 4 స్థానాల్లో అద్భుతంగా ఆడగలడని, ఎందుకు ఎంపిక చేయలేదని నిలదీస్తున్నారు. ఐదుగురు ప్రొఫెషనల్ బౌలర్లు జట్టులో ఎందుకని హెడ్ కోచ్ గంభీర్‌ను ప్రశ్నిస్తున్నారు.
News January 28, 2026
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం

TG: సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. కాగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
News January 28, 2026
ప్రమాదాల నుంచి వీళ్లు బయటపడ్డారు!

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ <<18980548>>చనిపోవడం<<>> తెలిసిందే. గతంలో పలువురు నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. MH CM ఫడణవీస్ ఏకంగా 6సార్లు బయటపడ్డారు. 1977లో PM మొరార్జీ దేశాయ్, 2001లో అశోక్ గెహ్లోత్, 2004లో కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, పృథ్వీరాజ్ చవాన్, కుమారి షెల్జా, 2007లో అమరీందర్ సింగ్, 2009లో సుఖ్‌బీర్ సింగ్, 2010లో రాజ్‌నాథ్ సింగ్, 2012లో అర్జున్ ముండా తప్పించుకున్నారు.


