News March 21, 2024

కరీంనగర్: హోటళ్లు, లాడ్జీల్లో పోలీసుల తనిఖీ

image

రానున్న ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌లోని అన్ని హోటళ్లు, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అక్రమ డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిని కట్టడి చేస్తామన్నారు.

Similar News

News April 21, 2025

కరీంనగర్: అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ కృషి: బండి

image

భారతదేశ చరిత్రలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎదుర్కొన్న అవమానాలు మరెవరూ ఎదుర్కోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో అన్నారు. ఎన్ని అవమానాలు ఎదురైనా, అడుగడుగునా హేళనకు గురైన వాటినే సోపానాలుగా చేసుకుంటూ అనుకున్న లక్ష్యానికి చేరుకోవడంతోపాటు తన చదువునంతా సమాజ శ్రేయస్సుకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.

News April 21, 2025

వీణవంక: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాద్‌లో ఇవాళ ఆటో, బైక్ <<16165881>>ఢీకొన్న<<>> విషయం తెలిసిందే. అయితే ఆటో, బైక్ ఢీ కొనడంతో కరీంనగర్‌కు చెందిన పేపర్ ఆటో నడిపే నాగరాజు మృతి చెందగా, బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు పేర్కొన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 21, 2025

కరీంనగర్: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

image

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో కరీంనగర్ జిల్లాలోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281.

error: Content is protected !!