News February 22, 2025
తడి చెత్తతో వుడ్ బ్రిక్స్ తయారీ

భద్రాచలం గ్రామపంచాయతీ అధ్వర్యంలో నిత్యం సేకరించే తడి చెత్తను డీఆర్సీసీలో ఏర్పాటు చేసిన యంత్రాల ద్వారా వేరు చేసి, వాటి ద్వారా వచ్చే పిప్పితో వుడెన్ ఇటుకలు (బ్రిక్స్) తయారు చేసే ప్రక్రియ గ్రామ పంచాయతీలో మొదలయింది. కాగా రాష్ట్రంలో ఈ పద్ధతిలో ఇటుకలు తయారు చేసే ఏకైక గ్రామ పంచాయతీగా భద్రాచలం నిలిచింది. కాగా వీటిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా అందించనున్నారు.
Similar News
News July 6, 2025
‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.
News July 6, 2025
వర్షంలో తడుస్తున్నారా?

కొందరు వర్షంలో తడుసుకుంటూ ఇంటికి వచ్చి యథావిధిగా పనులు చేసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తడిసిన వెంటనే దుస్తులు మార్చుకుంటే శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ కారకాల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంపై యాంటీ బాక్టీరియల్ క్రీమ్ రాసుకోవాలి. టీ లేదా కషాయాలు తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
News July 6, 2025
రాజీవ్ యువ వికాసానికి యువత ఎదురుచూపులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంకై గద్వాల జిల్లాలోని నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు సమర్పించి నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందుదామనుకున్న యువత నిరాశకు గురవుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకంను ప్రభుత్వం త్వరగా అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు.