News February 22, 2025

అన్నమయ్య: రైతు విభాగం అధ్యక్షుడిగా ఆరంరెడ్డి

image

వైసీపీ అన్నమయ్య జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా యర్రపురెడ్డి ఆరంరెడ్డి, రాజంపేట నియోజకవర్గ సోషల్ మీడియా వింగ్‌కు రామజయచంద్ర, మండల అధ్యక్షుడిగా ముప్పిరెడ్డి రామస్వామిరెడ్డిని అధిష్ఠానం నియమించింది. పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. సుండుపల్లెకు చెందిన ఆరంరెడ్డి, రామజయచంద్ర నియమితులవడంతో మండల వాసులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News December 27, 2025

జనవరి 15 నుంచి అన్ని సేవలు ఆన్‌లైన్లోనే: విశాఖ కలెక్టర్

image

విశాఖ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ప్రతి ఫైల్‌ను ఈ-ఆఫీస్ విధానంలోనే నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఫిజికల్ ఫైళ్లకు స్వస్తి పలికి, జనవరి 15 నుంచి ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అందించాలని స్పష్టం చేశారు. ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ (95523 00009)పై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని అధికారులకు సూచించారు.

News December 27, 2025

కేజీబీవీ విద్యార్థినులకు కాస్మెటిక్ ఛార్జీల విడుదల

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని కేజీబీవీ విద్యార్థినుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీలను జమ చేసినట్లు ఏజీసీడీఓ అనిత తెలిపారు. జిల్లాలోని 30 విద్యాలయాల్లో చదువుతున్న 7,735 మంది విద్యార్థినులకు గానూ రూ.77.35 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. అలాగే 10, 11, 12 తరగతుల విద్యార్థినుల పరీక్షల రవాణా ఖర్చుల నిమిత్తం మరో రూ.10.24 లక్షలు జమ అయినట్లు ఆమె వెల్లడించారు.

News December 27, 2025

ఈ జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది

image

శీతాకాలంలో పాడి పశువుల పాలు పితికే సమయాన్ని కూడా మార్చుకుంటే మంచిది. చలికాలంలో పగటి సమయం తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే పాలను ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పితకడం మంచిదని పశు సంరక్షణా అధికారులు సూచిస్తున్నారు. అలాగే చలిగా ఉండే ఉదయం మరియు రాత్రివేళల్లో పశువులకు ఎండుగడ్డి, పొడి దాణా అందించాలి. పచ్చిగడ్డిని ఉదయం 11 గంటల ప్రాంతంలో అందిస్తే మంచిది.