News March 21, 2024
అమ్రాబాద్: వన్యప్రాణులతో పరోక్ష రక్షణ

అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతంలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదికల ప్రకారం 2018 సంవత్సరంలో 12, 2021 సంవత్సరంలో 21 పులులు ఉండగా, ప్రస్తుతం 2024 సంవత్సరంలో 32 పెద్ద పులులు ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాక చిరుత పులులు 176, ఎలుగుబంట్లు 250, ఇతర అటవీ జంతువులు 10వేల వరకు ఉన్నాయి. క్రమంగా వన్యప్రాణుల సంఖ్య పెరగటంతో పరోక్షంగా అడవి సంరక్షణకు ఉపయోగపడుతోంది.
Similar News
News April 11, 2025
దేవరకద్ర: తడిసిన ధాన్యం.. ఆందోళనలో రైతన్నలు

దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో గురువారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతన్నను నిండా ముంచింది. మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు నిమిత్తం మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. కాగా గురవారం కురిసిన వర్షంతో ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
News April 11, 2025
బాలానగర్: బావిలో దూసి మహిళ SUICIDE

బావిలో పడి మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో చోటుచేసుంది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. లింగారం గ్రామానికి జంగమ్మ (35)కు కల్లు తాగే అలవాటు ఉండగా ఆమెను భర్త మందలించాడు. మనస్థాపానికి గురైనా ఆమె అందరూ గాఢ నిద్రలో ఉండగా.. గురువారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
News April 11, 2025
ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా: కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లనిర్మాణానికి ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని మహబూబ్ నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తహశీల్దార్లు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మఇంటి నిర్మాణాలకు కావాల్సిన ఇసుకను లబ్ధిదారులకు సరఫరా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి తహశీల్దార్లకు పంపించాలన్నారు.