News February 22, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు, పోలింగ్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా ఉండాలన్నారు.
Similar News
News December 30, 2025
బొకేలు, పుష్పగుచ్ఛాలు వద్దు.. దుప్పట్లు అందజేయాలి: మెదక్ కలెక్టర్

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే వారు బొకేలు, పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకొని రావద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేలా శీతాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చలి నుంచి రక్షణ పొందే దుప్పట్లు అందజేయాలన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు బొకేలు, శాలువాలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలపడం సహజమన్నారు.
News December 30, 2025
మనోహరాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం చిన్న శివునూరు గ్రామానికి చెందిన మల్లప్పగారి హేమంత్ సాయి (21) మృతిచెందినట్లు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. హేమంత్ సాయి శనివారం రాత్రి కుక్కదువు ప్రవీణ్ (20), మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్దీప్తో కలిసి బైక్‌పై మేడ్చల్ బయలుదేరారు. మార్గమధ్యంలో ముందు వెళ్తున్న వాహనం ఢీకొట్టడంతో హేమంత్ సాయి మృతిచెందగా, ఇరువురు గాయపడ్డారు.
News December 30, 2025
మెదక్ జిల్లాలో పుష్కలంగా యూరియా: కలెక్టర్

మెదక్ జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా పుష్కలంగా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ముందస్తు చర్యలతో ఇప్పటికే 12,673 మెట్రిక్ టన్నులు జిల్లాకు చేరుకున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు 7,343 మెట్రిక్ టన్నులు పంపిణీ కాగా ఇంకా 5,330 మెట్రిక్ టన్నులు నిల్వలో ఉన్నాయని వెల్లడించారు.


