News February 22, 2025

రామాయంపేటలో చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు

image

రామాయంపేట శివారులోని జాతీయ రహదారి సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న 1421 సర్వే నంబర్‌లోని వ్యవసాయ పొలం వద్ద గత రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఉదయం లేగదూడను చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.

Similar News

News February 23, 2025

మెదక్: నేడే గురుకుల పరీక్ష

image

తెలంగాణలోని వివిధ గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు మెదక్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్యాడ్‌తో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటోలతో రావాలని సూచించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే పరీక్షలకు ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.

News February 23, 2025

మెదక్: ఏడుపాయల జాతర నిధులకు ఎన్నికల కోడ్!

image

మెదక్ జిల్లాలో పవిత్రమైన ఏడుపాయల జాతర నిధులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారనుంది. ఈనెల 26వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జాతర జరగనుంది. జాతరకు సుమారుగా 15 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రతి సంవత్సరం ప్రభుత్వం రెండు కోట్లను మంజూరు చేస్తుంది. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది.

News February 23, 2025

మెదక్: ఎమ్మెల్సీ ఎన్నికలు, ఏడుపాయల జాతరపై ఎస్పీ సమీక్ష

image

27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్త్, ఏడుపాయల జాతరపై మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అధికారులు బందోబస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద పరిస్థితుల వివరాలను సేకరించాలన్నారు. మెదక్ జిల్లాలో 21 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని, వాటికీ ఆయుధాలు కలిగిన 8 రూట్ మొబైల్ పార్టీలు విధులు నిర్వహిస్తాయన్నారు. జాతర కోసం సూచనలు చేశారు.

error: Content is protected !!