News February 22, 2025

నూకాంబికా జాతరపై CMకు కొణతాల లేఖ

image

అనకాపల్లి శ్రీనూకాంబికా అమ్మవారి జాతరను రాష్ట్ర పండగగా గుర్తించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి జాతర విశిష్ఠత గురించి సీఎం, డిప్యూటీ సీఎం పవన్‌కు వివరించినట్లు తెలిపారు. ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు ప్రజల తరఫున వీరిద్దరినీ ఆహ్వానించినట్లు చెప్పారు.

Similar News

News November 9, 2025

అమ్రాబాద్: అక్కమహాదేవి గుహలకు మరో లాంచీ ఏర్పాటు

image

టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఏరియా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అక్కమహాదేవి గుహాల సందర్శనకు అధికారులు మరో లాంచీ ఏర్పాటు చేశారు. ఒకటే మినీ లాంచీ ఉండడంతో పర్యటకులు 3 గంటల వరకు వేచి ఉండేది. గమనించిన పర్యాటకశాఖ అధికారులు 30 మంది సామర్థ్యం గల మినీ లాంచీని దోమలపెంటకు తీసుకొచ్చారు. త్వరలోనే ప్రారంభిస్తామని పర్యాటక శాఖ జిల్లా అధికారి నరసింహ వెల్లడించారు.

News November 9, 2025

సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారి 65పై చేర్యాల గేటు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తుఫాన్‌ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణఖేడ్‌కు చెందిన బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News November 9, 2025

ములుగు: బాలుడి మృతిపై వైద్యశాఖ సీరియస్..!

image

ములుగు(D) కన్నాయిగూడెం(M) గూరేవులకు చెందిన హరినాథ్ స్వామి(7) అనే <<18238426>>బాలుడు పాముకాటుతో<<>> శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చిన బాలుడికి యాంటీడోస్ ఎందుకు ఇవ్వలేదనేదానిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా లేకపోవడంపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.