News February 22, 2025
MNCL: సమస్యల పరిష్కారానికే దర్బార్: CP

రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ శ్రీనివాస్ హాజరై స్పెషల్ పార్టీ, QRT సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అడిగిన వినతులను, సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూస్తామని తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా దర్బార్‌లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్‌కు వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చన్నారు.
Similar News
News July 7, 2025
నెల్లూరుకు చేరుకున్న మంత్రి లోకేశ్

నెల్లూరు పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు బొకే అందించి ఆహ్వానం పలికారు. ఈ మేరకు మంత్రి ఇవాళ VR స్కూల్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
News July 7, 2025
శ్రీకాకుళం IIITలో 149 సీట్లు ఖాళీ

శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ ఇటీవల పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.
News July 7, 2025
BIG ALERT.. అతి భారీ వర్షాలు

TG: పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. అటు రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. నిన్న పలు జిల్లాల్లో వర్షాలు పడిన సంగతి తెలిసిందే.