News February 22, 2025

ఆగస్టు 1న తేజా సజ్జ ‘మిరాయ్’ విడుదల

image

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్న ‘మిరాయ్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్‌గా, మంచు మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలున్నాయి.

Similar News

News February 23, 2025

ప్రశ్నించేందుకే అసెంబ్లీకి జగన్: వైవీ సుబ్బారెడ్డి

image

AP: ప్రజా సమస్యలపై కూటమి సర్కార్‌ను ప్రశ్నించేందుకే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని YCP నేత YV సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ‘కూటమి సర్కార్ ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. YCP నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. జగన్‌కు భద్రత కల్పించకపోవడం దారుణం. వీటన్నింటిపై జగన్ అసెంబ్లీలో ప్రశ్నిస్తారు’ అని పేర్కొన్నారు.

News February 23, 2025

CISFలో 1161 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 1161 కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పురుషులకు 945, మహిళలకు 103, ఎక్స్‌సర్వీస్‌మెన్-113 ఖాళీలున్నాయి. టెన్త్/ సంబంధిత ట్రేడ్ ఉన్న 18 నుంచి 23 ఏళ్లలోపు వారు అర్హులు. మార్చి 5 నుంచి APR 3 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ.21,700-69,100 జీతం చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు <>https://cisfrectt.cisf.gov.in/<<>>ను చూడండి.

News February 23, 2025

పనికి జస్టిఫై చేయాలి.. లేదంటే ఉద్యోగాల కోత: మస్క్

image

US అధ్యక్షుడు ట్రంప్‌కు సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘ఫెడరల్ సిబ్బంది తమ పనికి జస్టిఫై చేయాలి. లేదంటే ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఏం చేశారో ప్రతి సోమవారం రా.11.59లోపు నివేదిక సమర్పించాలని కోరారు. ఈ ప్రకటనను ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ ఖండించారు. చట్టవిరుద్ధమైన తొలగింపులను కోర్టులో సవాల్ చేస్తాన్నారు.

error: Content is protected !!