News February 22, 2025
యువతను శక్తివంతంగా మార్చడమే లక్ష్యం: శ్రీధర్ బాబు

టాస్క్ & శ్రీ సత్యసాయి సేవా సంస్థతో కలిసి ఉచిత డేటా ఇంజినీరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ట్వీట్ చేశారు. డిమాండ్‌లో ఉన్న టెక్ నైపుణ్యాలు,ఉద్యోగ అవకాశాలతో తెలంగాణ యువతను శక్తివంతంగా మార్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 23, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: ADB కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం 24న తేదిన ప్రజావాణి రద్దు చేసినట్లు ADB జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం, ఎన్నికలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.
News February 23, 2025
యాదాద్రిలో CM టూర్.. వాహనాలకు నో ఎంట్రీ

సీఎం రేవంత్ పర్యటన నేపథ్యంలో యాదాద్రి కొండపైకి వాహనాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. కొండ కింద పోలీసులు సూచించిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలను నిలిపి ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాలని సూచించారు. కొండపైకి నిత్యం 25 బస్సులు నడుస్తాయాన్నారు.
News February 23, 2025
కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.