News February 22, 2025
కాళేశ్వరంలో ఘనంగా సాగుతున్న పరిశుద్ధ్య పనులు

మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో మహాశివరాత్రికి ప్రత్యేక పరిశుద్ధ్య పనులు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. శనివారం పుష్కర ఘాట్ ఆవరణంలో అక్కడ ఉన్న చెత్త చదరంగం మొత్తం తీసి క్లీన్ చేసి దూరంగా పడేస్తున్నారు. దీంతో వీఐపీ ఘాట్ స్నానానికి వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంది.
Similar News
News February 23, 2025
టన్నెల్ ఘటన.. కార్మికుల ప్రాణాలపై ఆందోళన

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం 8-9 గంటల మధ్య టన్నెల్‌లో మట్టి కూలడం మొదలైంది. వెంటనే కొంతమంది బయటికి వచ్చినా 8 మంది మాత్రం అక్కడే చిక్కుకున్నారు. సాయంత్రానికి NDRF బృందం అక్కడికి చేరుకుంది. ఇవాళ్టి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనుంది. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన కార్మికులు చిక్కుకుపోవడంతో వారికి ఆక్సిజన్ అందుతోందా? లేదా? అన్నదే కీలకంగా మారింది.
News February 23, 2025
ADB: నేడు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో విద్యార్థుల కోసం అధికారులు పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.
News February 23, 2025
ములుగు: నేడే గురుకుల పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలోని వివిధ గురుకుల సొసైటీల కింద ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు ములుగు జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఉ.11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష కొనసాగుతుంది. విద్యార్థులు ఉదయం తొమ్మిది గంటల వరకే పరీక్ష సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2025-2026 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు.