News February 22, 2025
మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం దేవస్థానం నుంచి శ్రీశైలం మల్లన్న దంపతులకు పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కాణిపాకం దేవస్థానం ఈవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం పట్టు వస్త్రాలను తీసుకొని వచ్చి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావుకు అందించారు. అర్చకులు పండితులు, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు తీసుకున్నారు.
Similar News
News February 23, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

బర్డ్ ఫ్లూతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. అయినా చికెన్ ధరల్లో పెద్దగా మార్పులు లేవు. కొన్నిచోట్ల KG ₹100-₹150 మధ్యే చికెన్ లభిస్తుండగా, చాలా ప్రాంతాల్లో ₹190 వరకూ పలుకుతోంది. HYDలో ₹170-190 ఉండగా, సూర్యాపేటలో ₹150, తుంగతుర్తిలో ₹170, WGలో రూ.180, VJAలో రూ.180, VZM, కడపలో రూ.150, అనంతపురంలో రూ.120, రామచంద్రాపురంలో రూ.200 వరకూ ఉంది. మరి మీరు చికెన్ తింటున్నారా? ధర ఎంత? కామెంట్ చేయండి.
News February 23, 2025
మణుగూరు నీలకంఠేశ్వర ఆలయ ప్రత్యేకత..!

మణుగూరులోని నీలకంఠేశ్వర ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ ఆలయంలో శివుడు ద్విలింగ రూపంలో దర్శనం ఇవ్వడం ప్రత్యేకత. ఆలయం పాతాల లింగేశ్వరుడు స్తూపాకారంలో, నీలకంఠేశ్వరుడు బాణాకారంలో దర్శనమిస్తాడు. భూగర్భంలో పాతాల లింగేశ్వరుడు, పైన నీలకంఠేశ్వరుడు ఉంటాడు. కింద, పైభాగాల్లో ద్విలింగాలు దర్శనమిచ్చే ఆలయాలు దేశంలో రెండే ఉండగా, ఒకటి ఉజ్జయిని మహంకాళి ఆలయమని, రెండోది మణుగూరులోనే ఉందని చెబుతారు.
News February 23, 2025
SLBC TUNNEL: రంగంలోకి దిగిన ఆర్మీ

ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు. మరోవైపు ఎంతో కష్టపడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్లో భారీగా బురద, శిథిలాలు ఉండటంతో రెస్క్యూకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.