News February 22, 2025
అక్కడ ప్రజలందరికీ నీలి కళ్లే!

సాధారణంగా అధిక శాతం మంది ప్రజల కళ్లు గోధుమ రంగులో ఉంటాయి. కానీ, ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవేసి ప్రాంతంలో నివసించే బుటన్ తెగకు చెందిన ప్రజలు నీలి కళ్లను కలిగి ఉంటారు. వార్డెన్‌బర్గ్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి వల్ల ఇలా కళ్లు రంగు మారిపోయాయి. పిండం అభివృద్ధి సమయంలోనే ఈ వ్యాధి సంభవిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాగా, చాలా మంది మోడల్స్ లెన్స్ ద్వారా నీలి కళ్లుగా మార్చుకుంటుంటారు.
Similar News
News February 23, 2025
విషమంగానే పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం

ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన పోప్ ఫ్రాన్సిస్(88) పరిస్థితి విషమంగానే ఉందని వాటికన్ సిటీ తెలిపింది. ఇంకా ఆయన ఔట్ ఆఫ్ డేంజర్ కాదని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ‘హై ఫ్లో ఆక్సిజన్’ అందిస్తున్నట్లు పేర్కొంది. నిత్యం రక్త మార్పిడి విధానం కొనసాగుతోందని వెల్లడించింది. ఈనెల 14న ఆయన బ్రాంకైటిస్, న్యుమోనియాతో రోమ్‌లోని గెమెల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి పోప్ పరిస్థితి విషమంగానే ఉంది.
News February 23, 2025
స్కూళ్లకు ఒకే యాప్.. కీలక నిర్ణయం

AP: విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో స్కూల్, టీచర్, స్టూడెంట్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి. విద్యార్థుల సామర్థ్యాలు, మార్కులు, ఆరోగ్య సమాచారాలను పేరెంట్స్ సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే పాఠశాలల్లో సౌకర్యాల సమాచారమూ ఉంటుంది. ఉపాధ్యాయుల రోజువారీ కార్యకలాపాలు, సెలవులు, బదిలీల వివరాలను పొందుపరుస్తారు. త్వరలోనే యాప్ అందుబాటులోకి వస్తుంది.
News February 23, 2025
కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

AP: వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన <<15497715>>కొత్త రేషన్ కార్డులు<<>> అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగంలో మాట్లాడుతూ పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఇక రైతులకు పెండింగ్‌లో ఉన్న రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.