News February 22, 2025
సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామానికి చెందిన వుడెం మల్లారెడ్డి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. శుక్రవారం అర్ధరాత్రి బైక్ పై సిద్దిపేట నుంచి మర్పడ్గకు వస్తుండగా పొన్నాల ఆయిల్ మిల్ దాటాక మూల మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 23, 2025
ప్రకాశం: ‘ఫేక్ డాక్యుమెంట్స్ సేకరించాలి’

ఒంగోలు, పరిసర ప్రాంతాలలో నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో రెండేళ్ళ క్రితం వెలుగుచూసిన భూ అక్రమాలపై.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోడియా అరా తీశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో ప్రకాశం భవనంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు సృష్టించారో ఆధారాలను సేకరించాలని ఆదేశించారు.
News February 23, 2025
NGKL: నేడే గురుకుల విద్యాలయాలకు ప్రవేశ పరీక్ష

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు నేడు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 62 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. హాల్‌టికెట్లతో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోలతో రావాలని సూచించారు. ఉ. 11 గం. నుంచి మ.1 గంట వరకు జరిగే పరీక్షకు ఉ.9 గం.లకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
News February 23, 2025
అరకులోయలో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్..!

అల్లూరి కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ ఆదేశాల మేరకు అరకులోయ మండలంలో పబ్లిక్ ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో బ్రెస్ట్ ఫీడింగ్ కోసం తల్లులకు రూమ్స్ కేటాయించినట్టు సీడీపీఓ శారద పేర్కొన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్‌ను అరకులోయ తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో ఆఫీసు, పెదలబుడు సచివాలయం, అరకు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసి, పోస్టర్లు అంటించామని సీడీపీఓ తెలిపారు. తల్లులు ఈ సౌకర్యాలను గమనించి వాడుకోవాలని ఆమె కోరారు.