News February 22, 2025

పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలను పురస్కరించుకుని శనివారం జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేసి మాట్లాడారు.

Similar News

News February 23, 2025

NZB: యువతిపై సామూహిక అత్యాచారం

image

ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఓ యువతిపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. బాధితురాలితో ఉన్న మరో యువతి ఘటనాస్థలి నుంచి పారిపోయి గ్రామస్థులకు విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. యువతులను NZB నుంచి కారులో తెచ్చారని, మద్యం మత్తులో ఉన్నారని సమాచారం.

News February 23, 2025

శెట్‌పల్లిలో చెరువులో మృతదేహం లభ్యం

image

మోర్తాడ్ మండలం శెట్‌పల్లి గ్రామానికి చెందిన బండ్ల భీమన్న(55) అనే వ్యక్తి చెరువులో పడి మరణించాడు. నాలుగు రోజుల నుంచి కనిపించకపోయినా ఆయన మృతదేహం చెరువులో లభ్యమైంది. నాలుగు రోజుల కిందట లక్ష్మీ కాల వద్దకు వెళ్లి అందులో స్నానం కోసం దిగగా బయటకు రాలేదు. కాలువ ప్రవాహానికి కొట్టుకొచ్చి చెరువులో శివమై తేలాడు. తమ్ముడు రాజన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై విక్రమ్ తెలిపారు.

News February 23, 2025

అర్సపల్లి రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి

image

అర్సపల్లి రైల్వే గేటు సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. గుర్తు తెలియని రైలు ప్రమాదంలో మరణించిన మృతురాలి వయస్సు సుమారు 50 వరకు ఉంటుందన్నారు. నిన్న రాత్రి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఎస్ఐ చెప్పారు. మృతురాలిని గుర్తిస్తే 8712658591 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సాయిరెడ్డి కోరారు.

error: Content is protected !!