News February 22, 2025

ఖమ్మంలో పుష్ప నటుడు జగదీశ్ (కేశవ) సందడి

image

ఖమ్మంలో శనివారం పుష్ప మూవీ నటుడు జగదీశ్ (కేశవ) సందడి చేశారు.  బోనకల్ క్రాస్ రోడ్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. నటుడు జగదీశ్ ‘తగ్గేదేలే’ అంటూ అభిమానులను అలరించారు.

Similar News

News July 5, 2025

సాగర్ నుంచి పాలేరుకు నీటి విడుదల

image

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గినందున తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రాజెక్టు ఏఈ కృష్ణయ్య ఎడమ కాల్వ ద్వారా పాలేరుకు నీటిని విడుదల చేశారు. రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

News July 5, 2025

అత్యధికంగా ఖమ్మం రూరల్.. అత్యల్పంగా మధిర

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే పెరిగింది. గతేడాది 66,288 మంది ఉండగా, ఈ ఏడాది 68,175కు చేరింది. 1,887 మంది విద్యార్థులు పెరిగారు. అత్యధికంగా KMM (R) 359 మంది, అతి తక్కువగా మధిరలో ఆరుగురు పెరిగారు. కూసుమంచి 318, KMM (U)18, SPL 167, పెనుబల్లి 121, సింగరేణి 158, బోనకల్‌ 104, కల్లూరు 105, ఎర్రుపాలెం 91, ఏన్కూరు 75, ముదిగొండ 63, తల్లాడ 15, కామేపల్లిలో 11 మంది పెరిగారు.

News July 5, 2025

ఖమ్మం జిల్లాలో ముగిసిన కళాశాలల బంద్

image

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో ఈనెల 3, 4న PDSU తలపెట్టిన 48 గంటల కళాశాలల బంద్‌ శుక్రవారం నాటికి ముగిసింది. బంద్ సందర్భంగా ఖమ్మం కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల ముందు PDSU నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల సమస్యలు మాత్రం తీరడం లేదని దుయ్యబట్టారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.