News February 22, 2025
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపిక

కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపికైంది. మొత్తం 6 పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన వాటిలో మెదక్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలు పెంపుకై పిల్లలు చదవడం, రాయడం సంబంధించి పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఈ ల్యాబ్‌లో కృత్రిమ మేధా సాఫ్ట్ వేర్ పొందుపరుస్తారు.
Similar News
News February 25, 2026
మెదక్ జిల్లాకు టెన్త్ మూల్యాంకన కేంద్రం కేటాయింపు

మెదక్ జిల్లాకు ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని కేటాయిస్తూ రాష్ట్ర పరీక్షల విభాగం ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈఓ ఏ. విజయ తెలిపారు. జిల్లాలోనే కేంద్రం ఏర్పాటు కావడం వల్ల స్థానిక ఉపాధ్యాయులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
News February 25, 2026
మెదక్: తొలిరోజు 99.42 శాతం

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు 99.42 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు డిఐఈఓ మాధవి తెలిపారు. మొత్తం 6,660 మంది విద్యార్థులకు గాను 6,622 మంది హాజరయ్యారని, కేవలం 38 మంది మాత్రమే గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జనరల్ విభాగంలో 14 మంది, ఒకేషనల్ విభాగంలో 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని వివరించారు.
News February 25, 2026
మెదక్: పరీక్షా కేంద్రాల సందర్శించిన ఎస్పీ

నేడు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని తెలిపారు.


