News February 22, 2025

ఆప్ వింత.. లేని శాఖకు 20 నెలలుగా మినిస్టర్

image

పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంలో వింత ఘటన జరిగింది. లేని శాఖకు కుల్దీప్‌ సింగ్ 20 నెలలుగా మంత్రిగా ఉన్నారు. తాజాగా అసలు ఆ శాఖ మనుగడలో లేదని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. తప్పు తెలుసుకొని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, కుల్దీప్‌సింగ్ 20 నెలలుగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్(ఉనికిలో లేనిది), NRI అఫైర్స్ శాఖలకు మంత్రిగా ఉండటం విశేషం. ఆప్ ప్రభుత్వం పాలనను జోక్‌లా మార్చిందని BJP మండిపడింది.

Similar News

News February 23, 2025

స్కూళ్లకు ఒకే యాప్.. కీలక నిర్ణయం

image

AP: విద్యాశాఖలో ప్రస్తుతం ఉన్న 45 యాప్‌ల స్థానంలో ఒకే యాప్ తీసుకొచ్చేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో స్కూల్, టీచర్, స్టూడెంట్ అనే 3 ఆప్షన్లు ఉంటాయి. విద్యార్థుల సామర్థ్యాలు, మార్కులు, ఆరోగ్య సమాచారాలను పేరెంట్స్ సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే పాఠశాలల్లో సౌకర్యాల సమాచారమూ ఉంటుంది. ఉపాధ్యాయుల రోజువారీ కార్యకలాపాలు, సెలవులు, బదిలీల వివరాలను పొందుపరుస్తారు. త్వరలోనే యాప్ అందుబాటులోకి వస్తుంది.

News February 23, 2025

కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

image

AP: వచ్చే నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన <<15497715>>కొత్త రేషన్ కార్డులు<<>> అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగంలో మాట్లాడుతూ పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకూ అవకాశం కల్పిస్తామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఇక రైతులకు పెండింగ్‌లో ఉన్న రవాణా, హమాలీ ఛార్జీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.

News February 23, 2025

ఏప్రిల్ 29న NCET.. నోటిఫికేషన్ విడుదల

image

2025-26లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి NCET(నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి తెలిపింది. APR 29న దేశవ్యాప్తంగా తెలుగు సహా 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తామంది. ర్యాంక్ ఆధారంగా 64 IIT, NIT, కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొంది.
వెబ్‌సైట్: <>https://exams.nta.ac.in/NCET/<<>>

error: Content is protected !!