News February 22, 2025
పంట పొలంలో పెళ్లి.. వైరల్

భారీ ఫంక్షన్ హాల్, డెకరేషన్, డీజే చప్పుళ్ల మధ్య పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో పంజాబ్‌కు చెందిన ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తమ గ్రామంలోని పంట పొలం మధ్య వివాహం చేసుకుని దుర్లభ్ సింగ్, హర్మన్‌కౌర్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు చేసిన పోరాట నినాదాలను ముద్రించిన స్వీట్ బాక్సులను అతిథులకు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
Similar News
News February 23, 2025
పబ్లిక్ ఇష్యూకు ప్రభుత్వ పవర్ సంస్థలు!

ప్రభుత్వ రంగానికి చెందిన 5 విద్యుత్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. అవసరమైన నిధులు సమీకరించేందుకు IPO ద్వారా వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్, గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ సంస్థలు పబ్లిక్ ఇష్యూ కోసం బ్యాంకర్లను నియమించుకునే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. మరో 3 డిస్కమ్‌లు కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 23, 2025
మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఎక్స్‌ట్రా ఛార్జీ

TG: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24 నుంచి 28 వరకు 43 శైవ క్షేత్రాలకు 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని TGSRTC వెల్లడించింది. వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని తెలిపింది. శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం, కొమరవెల్లి, అలంపూర్, రామప్పకు ఈ బస్సులు వెళ్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయంది.
News February 23, 2025
విషమంగానే పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం

ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన పోప్ ఫ్రాన్సిస్(88) పరిస్థితి విషమంగానే ఉందని వాటికన్ సిటీ తెలిపింది. ఇంకా ఆయన ఔట్ ఆఫ్ డేంజర్ కాదని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ‘హై ఫ్లో ఆక్సిజన్’ అందిస్తున్నట్లు పేర్కొంది. నిత్యం రక్త మార్పిడి విధానం కొనసాగుతోందని వెల్లడించింది. ఈనెల 14న ఆయన బ్రాంకైటిస్, న్యుమోనియాతో రోమ్‌లోని గెమెల్లీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి పోప్ పరిస్థితి విషమంగానే ఉంది.