News February 22, 2025
ఈ నెల 28న క్యాబినెట్ భేటీ

AP: ఈ నెల 28న అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది. 2025-26 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను క్యాబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని పలు పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేస్తారని తెలుస్తోంది.
Similar News
News February 23, 2025
25న MLAల అనర్హత కేసు విచారణ

తెలంగాణలో పార్టీ మారిన MLAలపై అనర్హత వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో 25న విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు విననుంది. BRSలో గెలిచిన MLAలు పోచారం, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, కృష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం, తెల్లం, కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని KTR సహా BRS నేతలు ఈ పిటిషన్లు వేశారు.
News February 23, 2025
పబ్లిక్ ఇష్యూకు ప్రభుత్వ పవర్ సంస్థలు!

ప్రభుత్వ రంగానికి చెందిన 5 విద్యుత్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. అవసరమైన నిధులు సమీకరించేందుకు IPO ద్వారా వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్, గుజరాత్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ సంస్థలు పబ్లిక్ ఇష్యూ కోసం బ్యాంకర్లను నియమించుకునే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం. మరో 3 డిస్కమ్‌లు కూడా ఇదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 23, 2025
మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఎక్స్‌ట్రా ఛార్జీ

TG: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24 నుంచి 28 వరకు 43 శైవ క్షేత్రాలకు 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని TGSRTC వెల్లడించింది. వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని తెలిపింది. శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం, కొమరవెల్లి, అలంపూర్, రామప్పకు ఈ బస్సులు వెళ్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయంది.