News February 22, 2025

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలా.. జీతం తగ్గిస్తాం ఓకేనా!

image

టాక్సిక్ వర్క్ కల్చర్‌పై ఓ ఉద్యోగి Redditలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో గడిపేందుకు ఎక్కువ టైమ్ కావాలా! మేం మీ బాధ్యతలను సర్దుబాటు చేస్తున్నాం. పని తక్కువే కాబట్టి జీతం తక్కువగా ఇస్తాం. జాబ్ పోస్టైతే మారదు. కండీషన్స్ ఫామ్‌పై సైన్ చేయండి. మేం చెప్పేంత వరకు ఏ పనీ చేయకండ’ని తన కంపెనీ నుంచి మెయిల్ వచ్చిందన్నారు. ఉద్యోగం తీసేయడానికి ఇదో సాకు అంటూ నెటిజన్లు మండిపడ్డారు.

Similar News

News November 11, 2025

ఉగ్రవాదంపై పోరాటానికి ఇండియాకు మా మద్దతు: ఇజ్రాయెల్

image

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ విచారం వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కాగా ఈ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. ఈ ఘటనపై NIA దర్యాప్తు చేయనుంది.

News November 11, 2025

పలు రైళ్లు రద్దు.. ఆ స్టేషన్ల మధ్య 2 స్పెషల్ రైళ్లు

image

ట్రాక్ మరమ్మతుల కారణంగా విజయవాడ డివిజన్‌లో నాలుగు రైళ్లను ఈ నెల 20న రద్దు చేసినట్లు SCR వెల్లడించింది. ఈ జాబితాలో కాకినాడ పోర్ట్-విశాఖ(17267), విశాఖ-కాకినాడ పోర్ట్(17268), రాజమండ్రి-విశాఖ(67285), విశాఖ-రాజమండ్రి(67286) రైళ్లు ఉన్నాయి. అలాగే ప్రయాణికుల రద్దీ కారణంగా రేపు నర్సాపూర్-సికింద్రాబాద్(07455), ఈ నెల 15న అనకాపల్లి-సికింద్రాబాద్(07179) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.

News November 11, 2025

ICAR-IARIలో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని<> ICAR<<>>-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 5 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్, ఫీల్డ్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, NET/ PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://new.iari.res.in