News February 22, 2025
కాకినాడ జిల్లాలో నేరాలపై ఎస్పీ నెలవారీ సమీక్ష

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాదవ్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. శనివారం నుంచి కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ జిల్లా పోలీసు అధికారులు, ట్రైనీ ఐపీఎస్‌లు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న నేరాలపై చర్చించారు. నేరాలు అరికట్టడంలో తీసుకున్న చర్యలపై చర్చించారు.
Similar News
News January 17, 2026
మెదక్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు: కలెక్టర్

మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల వార్డు రిజర్వేషన్లను రాజకీయ పార్టీల సమక్షంలో పారదర్శకంగా ఖరారు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్‌లో 32, తూప్రాన్‌లో 16, నర్సాపూర్‌లో 15, రామాయంపేటలో 12 వార్డులకు రిజర్వేషన్లు కేటాయించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News January 17, 2026
నెల్లూరు: డ్రస్ సర్కిల్’ డ్రా విజేతకు కార్ అందజేత

నెల్లూరులోని ప్రముఖ వస్త్ర దుకాణం ‘డ్రస్ సర్కిల్ షాపింగ్ మాల్’లో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సందర్భంగా ‘భలే ఛాన్స్ బాసు’ లక్కీ డ్రాను ప్రవేశపెట్టారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవరి 15 వరకు జరిగిన వస్త్రాల కొనుగోళ్లపై కూపన్లు అందించారు. ఈ డ్రాలో N.దయాకర్ రెడ్డి (కూపన్ నంబర్: 21038) మొదటి బహుమతిగా కారును గెలుచుకున్నారు.
News January 17, 2026
ఆదిలాబాద్: భక్తుల ఇంటికే మేడారం ప్రసాదం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని భక్తుల ఇంటికే ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి ADB ఆర్టీసీ ఆర్ఎం భవాని ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు అమ్మవారి ప్రసాదాన్ని భక్తులు tgsrtcologistics.co.in వెబ్ సైట్, ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ప్రసాదం అందించడం జరుగుతుందన్నారు.


