News February 22, 2025

నిర్మల్: సీఎంఆర్ బియ్యం అక్రమాలపై కఠిన చర్యలు: కలెక్టర్

image

సీఎంఆర్ బియ్యం అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడిచిన 8 నెలలలో సీఎంఆర్ బియ్యం అక్రమాలు చేసిన పలు రైస్ మిల్లు యాజమాన్యాలపై చర్యలు తీసుకొని, రికవరీకి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.

Similar News

News November 11, 2025

కాకినాడ కలెక్టర్ తీరుపై విమర్శలు!

image

కలెక్టర్ షాణ్మోహన్ వివాదాలలో ఇరుక్కుంటున్నారు. కాకినాడ నగరంలో ఆస్తి పన్నులు పెంచుతామని, పార్కులు ప్రైవేటీకరణ చేస్తామని ఆయన ప్రకటించడం, నగరంలో ఖాళీ స్థలాలు ఉండి వాటిని పరిశుభ్రం చేసుకోకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామనడం విమర్శలకు తావిచ్చాయి. మరోవైపు కలెక్టర్‌గా 7 నియోజకవర్గాలను సమ దృష్టితో చూడడం లేదని, పిఠాపురానికి పెద్దపీఠ వేస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఒకింత ఆగ్రహంగా ఉన్నారట.

News November 11, 2025

ఉమ్మడి మెదక్‌కు ‘హై అలర్ట్’.. చలి పులి పంజా!

image

ఉమ్మడి మెదక్ జిల్లా వాసులకు వాతావరణ శాఖ ‘చలి హెచ్చరిక’ జారీ చేసింది. నవంబర్‌ నెలలో అసాధారణంగా ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయి. నవంబర్‌ 11 నుంచి 19 వరకు బలమైన చలి ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా 13 నుంచి 17 తేదీల మధ్య సింగిల్ డిజిట్ స్థాయికి 9-12°C ఉష్ణోగ్రతలు పడిపోతాయని అంచనా. సాధారణంగా ఇంత కాలం చలి ఉండదు, కానీ ఈసారి 8 నుంచి 10 రోజులపాటు తీవ్రమైన చలికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News November 11, 2025

UGC-NET దరఖాస్తులో తప్పుల సవరణకు అవకాశం

image

అసిస్టెంట్ ప్రొఫెసర్, JRFకోసం నిర్వహించే UGC-NET డిసెంబర్ 2025 దరఖాస్తులో తప్పుల సవరణకు NTA అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 12న సవరణ చేసుకోవచ్చని ప్రకటించింది. అభ్యర్థుల పేరు, జెండర్, ఫొటో, సంతకం, మొబైల్ నంబర్, ఈ- మెయిల్, అడ్రస్, పరీక్ష సిటీ మార్చుకోవచ్చు. పరీక్షలు డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు రోజుకు రెండు సెషన్లలో జరగనున్నాయి.