News February 22, 2025

60 కోట్ల మంది స్నానమాచరించినా శుద్ధిగానే గంగానది: సైంటిస్ట్

image

‘మహాకుంభమేళా’లో దాదాపు 60 కోట్ల మంది స్నానమాచరించినా గంగానదిలోని నీళ్లు పరిశుభ్రంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త డా. అజయ్ సోంకర్ గంగా జలంపై అధ్యయనం చేశారు. ‘గంగా నదిలో 1100 రకాల బాక్టీరియోఫేజ్‌లు సహజంగా నీటిని శుద్ధి చేస్తాయి. కాలుష్యాన్ని తొలగించడంతో పాటు చెడు బాక్టీరియా, సూక్ష్మక్రిములను నాశనం చేసి శుద్ధి చేస్తాయి’ అని సోంకర్ తెలిపారు.

Similar News

News February 23, 2025

రామాయణ రణ రంగంలోకి ‘రావణ్’

image

నితేశ్ తివారీ డైరెక్షన్‌లో ‘రామాయణ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రావణుడి పాత్రలో కనిపించనున్న యశ్ కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం. యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తొలి భాగం 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.

News February 23, 2025

రాష్ట్రంలో ఎనిమిది మంది ఐపీఎస్‌ల బదిలీ

image

TG: రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పి.విశ్వప్రసాద్-క్రైమ్స్ అదనపు కమిషనర్ HYD, బి.నవీన్ కుమార్-CID ఎస్పీ HYD, గజారావు- ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సైబరాబాద్, డి.జోయెల్ డేవిస్-ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ HYD, సిరిశెట్టి సంకీర్త్ గవర్నర్ ADC, బి.రాంరెడ్డి- CID SP HYD, సీహెచ్ శ్రీధర్-ఇంటెలిజెన్స్ ఎస్పీ HYD, ఎస్.చైతన్య కుమార్-SB డీసీపీ HYD.

News February 23, 2025

‘సారీ అమ్మ.. ఈ రోజు చనిపోతున్నా’ అని నోట్‌బుక్‌లో రాసి

image

TG: చిన్న విషయాలకే పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడం కలవరపెడుతోంది. తాజాగా HYD ఉప్పల్‌లోని ఓ స్కూల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. క్లాస్ రూమ్‌లోని CCTV డైరెక్షన్‌ను మార్చడంతో 8th క్లాస్ బాలుడు సంగారెడ్డి(13)ని PET మందలించి కొట్టాడు. మరో టీచర్ కూడా తిట్టింది. మనస్తాపానికి గురైన బాలుడు నోట్ బుక్‌లో ‘సారీ మదర్.. ఐ విల్ డై టుడే’ అని రాసి పాఠశాల భవనంపై నుంచి దూకేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు.

error: Content is protected !!