News February 22, 2025
అంజనీకుమార్, అభిలాషలను రిలీవ్ చేసిన TG సర్కార్

కేంద్ర హోంశాఖ ఆదేశాలతో IPS అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్‌లను రిలీవ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఏపీలో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. మరో ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతిపై సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ అంశాన్ని ప్రభుత్వం ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ ఆదేశాలను బట్టి రిలీవ్ అంశం ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Similar News
News February 23, 2025
టన్నెల్ ప్రమాదం.. బురదతో రెస్క్యూకు అంతరాయం

TG: SLBC టన్నెల్‌లో <<15548177>>చిక్కుకున్న<<>> 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 14 కిలోమీటర్ల లోపల బాధితులు ఉండగా బురద, మోకాళ్లలోతు నీళ్ల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. NDRF బృందాలు లోపలికి నడుచుకుని వెళ్లి శిథిలాలను తొలగిస్తున్నాయి. ప్రమాదం జరిగి ఇప్పటికే 24 గంటలు అవుతుండటంతో బాధితుల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
News February 23, 2025
పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం?

TG: సిమెంట్, స్టీల్ ఖర్చు లేకుండా ఉండేందుకు ఇందిరమ్మ ఇళ్లను పిల్లర్లు లేకుండా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లర్ల నిర్మాణానికి వ్యయం ఎక్కువై లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా ఆపేస్తారనే కారణంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మండలానికి ఒకటి చొప్పున మోడల్ ఇళ్లను నిర్మించనుంది. పిల్లర్లు, బీములు లేకుండా నిర్మించేందుకు ‘న్యాక్’లో కొందరు మేస్త్రీలకు శిక్షణ ఇచ్చింది.
News February 23, 2025
5 జిల్లాల పరిధిలో అమరావతి ORR.. కేంద్రం గెజిట్

AP: రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 189.9KM మేర అలైన్‌మెంట్‌కు ఓకే చెప్పింది. 5 జిల్లాల(ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు) పరిధిలోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం జరగనుంది. త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ORRలో 2 బ్రిడ్జిలు, 78 అండర్‌పాస్‌లు, 65 వంతెనలు నిర్మిస్తారు.