News February 22, 2025
మళ్లీ థియేటర్లలోకి ‘యుగానికి ఒక్కడు’

తమిళ స్టార్ నటుడు కార్తీ హీరోగా సెల్వరాఘవన్ తెరకెక్కించిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా మరోసారి థియేటర్లలో విడుదలవనుంది. 2010 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మార్చి 14న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, USAలో రీరిలీజ్ అవుతుందని తెలుపుతూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
Similar News
News February 23, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

బర్డ్ ఫ్లూతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. అయినా చికెన్ ధరల్లో పెద్దగా మార్పులు లేవు. కొన్నిచోట్ల KG ₹100-₹150 మధ్యే చికెన్ లభిస్తుండగా, చాలా ప్రాంతాల్లో ₹190 వరకూ పలుకుతోంది. HYDలో ₹170-190 ఉండగా, సూర్యాపేటలో ₹150, తుంగతుర్తిలో ₹170, WGలో రూ.180, VJAలో రూ.180, VZM, కడపలో రూ.150, అనంతపురంలో రూ.120, రామచంద్రాపురంలో రూ.200 వరకూ ఉంది. మరి మీరు చికెన్ తింటున్నారా? ధర ఎంత? కామెంట్ చేయండి.
News February 23, 2025
SLBC TUNNEL: రంగంలోకి దిగిన ఆర్మీ

ఎస్ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. హైదరాబాద్ నుంచి 23 మందితో కూడుకున్న టీమ్ ఘటనా స్థలానికి చేరుకుంది. కార్మికులను రక్షించేందుకు వారు పలు రకాల ప్లాన్లు వేస్తున్నారు. మరోవైపు ఎంతో కష్టపడి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్‌లో భారీగా బురద, శిథిలాలు ఉండటంతో రెస్క్యూకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
News February 23, 2025
రామాయణ రణ రంగంలోకి ‘రావణ్’

నితేశ్ తివారీ డైరెక్షన్‌లో ‘రామాయణ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రావణుడి పాత్రలో కనిపించనున్న యశ్ కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతున్న చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం. యుద్ధ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తొలి భాగం 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.