News February 22, 2025
మాటలకందని గౌరవమిది: మోదీకి విక్కీ కౌశల్, రష్మిక మందన్న రిప్లై

దేశవ్యాప్తంగా ‘ఛావా’ <<15542065>>గాలి<<>> వీస్తోందన్న PM మోదీకి ఆ చిత్ర నటీనటులు ధన్యవాదాలు తెలియజేశారు. శంభాజీ పాత్రలో వీర, శూర, రౌద్ర రసాలు ఒలికించిన విక్కీ కౌశల్ ‘మాటల్లో వర్ణించలేని గౌరవమిది. నరేంద్ర మోదీజీకి కృతజ్ఞతలు’ అని పోస్ట్ పెట్టారు. యేసుభాయి పాత్రకు ప్రాణం పోసిన రష్మిక మందన్న ‘థాంక్యూ నరేంద్రమోదీ సర్. నిజంగా మాకిది గౌరవం’ అని అన్నారు. ఛావాను అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని డిమాండ్లు రావడం తెలిసిందే.
Similar News
News February 23, 2025
‘సారీ అమ్మ.. ఈ రోజు చనిపోతున్నా’ అని నోట్‌బుక్‌లో రాసి

TG: చిన్న విషయాలకే పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకోవడం కలవరపెడుతోంది. తాజాగా HYD ఉప్పల్‌లోని ఓ స్కూల్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. క్లాస్ రూమ్‌లోని CCTV డైరెక్షన్‌ను మార్చడంతో 8th క్లాస్ బాలుడు సంగారెడ్డి(13)ని PET మందలించి కొట్టాడు. మరో టీచర్ కూడా తిట్టింది. మనస్తాపానికి గురైన బాలుడు నోట్ బుక్‌లో ‘సారీ మదర్.. ఐ విల్ డై టుడే’ అని రాసి పాఠశాల భవనంపై నుంచి దూకేశాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించాడు.
News February 23, 2025
టన్నెల్ ప్రమాదం.. బురదతో రెస్క్యూకు అంతరాయం

TG: SLBC టన్నెల్‌లో <<15548177>>చిక్కుకున్న<<>> 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 14 కిలోమీటర్ల లోపల బాధితులు ఉండగా బురద, మోకాళ్లలోతు నీళ్ల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. NDRF బృందాలు లోపలికి నడుచుకుని వెళ్లి శిథిలాలను తొలగిస్తున్నాయి. ప్రమాదం జరిగి ఇప్పటికే 24 గంటలు అవుతుండటంతో బాధితుల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
News February 23, 2025
పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం?

TG: సిమెంట్, స్టీల్ ఖర్చు లేకుండా ఉండేందుకు ఇందిరమ్మ ఇళ్లను పిల్లర్లు లేకుండా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లర్ల నిర్మాణానికి వ్యయం ఎక్కువై లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా ఆపేస్తారనే కారణంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మండలానికి ఒకటి చొప్పున మోడల్ ఇళ్లను నిర్మించనుంది. పిల్లర్లు, బీములు లేకుండా నిర్మించేందుకు ‘న్యాక్’లో కొందరు మేస్త్రీలకు శిక్షణ ఇచ్చింది.