News February 22, 2025

NRPT: సీఎం వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ డీకే అరుణ

image

నారాయణపేట ‘ప్రజా పాలన-ప్రగతి బాట’బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి మోదీ పాలనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. మోదీ పాలనకు.. రేవంత్ పాలనకు నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనను ప్రజలు చూసి మూడోసారి బీజేపీకి అధికారం అందించారన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలకే దిక్కు లేదని ఎంపీ డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.

Similar News

News January 16, 2026

పల్నాడు జిల్లాలో కీలక పట్టణంగా పిడుగురాళ్ల!

image

పల్నాడు జిల్లాలో కీలక పట్టణంగా పిడుగురాళ్ల రూపుదిద్దుకుంటోంది. జిల్లాలో అతి పెద్దదైన పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం 2026-27లో 100 MBBS సీట్ల ప్రవేశం, బెడ్ల పెంపకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యాపార కేంద్రమైన పిడుగురాళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజకీయ నేతలు సైతం పిడుగురాళ్ల కేంద్రంగా నియోజకవర్గ రాజకీయాలు పర్యవేక్షిస్తున్నారు.

News January 16, 2026

MDK:‘ఫోన్ పే రూ.5000 Gift’.. జాగ్రత్త !

image

పండుగ బహుమతుల పేరుతో సైబర్ కేటుగాళ్లు పంజా విసురుతున్నారు. “ఫోన్‌పే పొంగల్ గిఫ్ట్” అంటూ రూ.5,000 ఆశ చూపిస్తూ వస్తున్న నకిలీ లింకులపై ఉమ్మడి మెదక్ జిల్లా పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఇలాంటి అనుమానాస్పద లింకులు క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతాయని, ఆన్‌లైన్ మోసాల పట్ల అవగాహనతో ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News January 16, 2026

విజయనగరంలో కేజీ చికెన్ రూ.240

image

నేడు కనుమ పండగ సందర్భంగా మాంసం ప్రియులకు తిందాం అని ఉన్నా శుక్రవారం సెంటిమెంట్‌తో ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో చికెన్, మటన్ షాపులు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. కాగా నగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతుండగా.. చికెన్ (స్కిన్) రూ.260, స్కిన్ లెస్ రూ.240, రొయ్యలు రూ.350/250, చేపలు రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.