News February 22, 2025
కుమారుడితో కలిసి క్రికెట్ ఆడిన ద్రవిడ్

టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన కొడుకు అన్వయ్ ద్రవిడ్‌తో కలిసి ఓ క్లబ్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచులో ద్రవిడ్ 8 బంతులాడి 10 పరుగులకే ఔటయ్యారు. కానీ అన్వయ్ మాత్రం హాఫ్ సెంచరీ(58)తో మెరిశారు. కాగా రాహుల్ ఇద్దరు కుమారులు సమిత్, అన్వయ్ క్రికెట్‌లో రాణిస్తున్నారు. సమిత్ కేపీఎల్‌లో కూడా ఆడారు. ప్రస్తుతం కర్ణాటక తరఫున రంజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Similar News
News February 23, 2025
రేపే అకౌంట్లలోకి పీఎం కిసాన్ నిధులు

పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ నిధులు విడుదల చేస్తారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేయనున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 లక్షలకుపైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రూ.1,460 కోట్లకుపైగా నిధులు విడుదల కానున్నాయి.
News February 23, 2025
నిరుద్యోగులపై లాఠీ ఛార్జ్ దారుణం: బొత్స

AP: గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తామంటూ చివరి వరకు నమ్మించి ప్రభుత్వం అభ్యర్థులను మోసం చేసిందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న అభ్యర్థులను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. గందరగోళం మధ్య పరీక్ష నిర్వహణ ఆమోదయోగ్యం కాదని చెప్పారు.
News February 23, 2025
దుబాయ్‌లో ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ దుబాయ్‌లో సందడి చేస్తోంది. ఓ ప్రైవేట్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మీ ప్రణతి మెరిశారు. వీరితోపాటు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తెరకెక్కించే ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది.