News February 22, 2025
నంద్యాల జిల్లా నేటి ముఖ్య వార్తలు

*ప్రజలనుంచి వినుతులు స్వీకరించిన :ఎమ్మెల్యే బుడ్డా *మహానంది దర్శనం టికెట్ల కోసం 7 కౌంటర్లు ఏర్పాటు *శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ వద్ద ప్రమాదం *మల్లన్న దంపతులకు కాణిపాక వినాయకుడి పట్టు వస్త్రాలు *శ్రీశైలంలో నేడు మయూరిపై త్రినేత్రుడు విహారం *డబుల్ హెచ్ఓ సేవలకు పూర్తి సహకారం అందిస్తాం :ఎంపీ *భూ సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడాలి: ఆర్డీఓ *మంచినీటి కోసం వెళ్లిన దుప్పికి గాయాలు
Similar News
News October 30, 2025
ALERT.. పిడుగులతో కూడిన వర్షాలు

AP: రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద ఇవాళ 6.30pmకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.67 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుండగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
News October 30, 2025
కరీంనగర్లో నలుగురు దొంగల ముఠా అరెస్టు

కరీంనగర్ జిల్లాలో తరచు దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ రామచందర్ రావు తెలిపారు. మహమ్మద్ గౌస్ బాబా, మహమ్మద్ అబీద్, దొబ్బల పవన్, సుధాకర్ అనే ఈ నలుగురు కలెక్టరేట్ గేటు వద్ద ఓ వ్యక్తిని బెదిరించి ₹3000 దోచుకున్నారు. ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.
News October 30, 2025
విత్తనాల కొనుగోలుకు ₹110 కోట్ల బ్యాంకు రుణం

AP: రబీ(2025-26)లో పంపిణీ కోసం అవసరమైన విత్తనాల కొనుగోలుకు ఏపీ సీడ్ కార్పొరేషన్ ₹110 కోట్ల రుణం తీసుకోనుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి తీసుకొనే ఈ రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సంస్థ రుణాన్ని తీర్చలేని పక్షంలో ఈ గ్యారంటీ వర్తిస్తుంది. తక్కువ వడ్డీ రేట్లు, ముందస్తు క్లోజర్‌కు సున్నాఛార్జీలు ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఈ రుణంతో రైతులకు సకాలంలో విత్తనాలు అందిస్తారు.


